4 July, 2026 | 3:58 PM

ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆకస్మిక తనిఖీ

12-06-2024 12:35 AM

గద్వాల (వనపర్తి), జూన్ 11 (విజయక్రాంతి): గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర మదర్ అండ్ చిల్డ్రన్స్ దవాఖానను అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్కే సిద్దప్పతో కలిసి జిల్లా వైద్యాధికారిణి శశికళ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ నెల 9 రాఘవేంద్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శివలీల అనే గర్భిణి మృతిచెందిందని, అందుకు సంబంధించిన ఐపీ, ఓటీ రిజిస్టర్స్, ల్యాబ్ , స్కానింగ్ రిపోర్ట్స్, సీసెక్షన్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్ తనిఖీ చేశారు. రికార్డులను, రిపోర్టులను సీజ్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్ అందజేస్తామని వెల్లడించారు. అనంతరం చింతలపేటలోని సూరజ్ క్లినిక్‌ను తనిఖీ చేశారు. క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా ఇతర వ్యక్తులు రోగులకు చికిత్సను అందిస్తున్న నేపథ్యంలో క్లినిక్‌కు నోటీసులను జారి చేయడం జరిగిందన్నారు.