4 July, 2026 | 7:01 PM

కొత్త బస్సులు కొనుగోలు చేయాలి

12-06-2024 12:35 AM

నిర్మల్ , జూన్11 (విజయక్రాంతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ బస్ డిపో ఎదుట ఆందోళన చేశారు. బస్సుల్లో రద్దీ కారణంగా గర్భిణులు, వృద్ధులు సీట్లు దొరుకక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల కష్టాలను తొలగించాలని కోరారు. అనంతరం  డిపో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగామణి, కవిత, వసంత, తైసిన్ తదితరులు ఉన్నారు.