24-09-2025 12:26:27 AM
హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా గంగపుత్ర పరస్పర సహాయక సహకార గృహ నిర్మాణ పరిమితి సంఘం 15వ సర్వసభ్య సమావేశం మంగళవారం హనుమకొండలోని పల్ల రాజేశ్వర్ రెడ్డి భవనంలో డోలి రాజలింగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘం చేసిన అభివృద్ధి పనులను సభ్యులకు వివరించారు. మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.
సభ్యులందరూ సొసైటీ చేసిన అభివృద్ధి పనులకు సంతోషదాయకంగా ఉన్నారని అలాగే అభివృద్ధి పనులకు సంఘం పూర్తిగా సహకరించి పనులు పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం జరిగిన ఎన్నికలలో పాత కమిటీని కొనసాగిస్తూ నలుగురు కొత్తగా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కొత్త గా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మొగిలి, సుగుణ, సదానందం, వెంకటేశ్వర్లు, ఈ ఎన్నికల సజా వుగా జరగడానికి ఎలక్షన్ ఆఫీసర్గా డాక్టర్ ఇమ్మడి పుల్లయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, సరోజన, అరుణ, అమిత, సూర్యనారాయణ, శామ్, రామచందర్, రామ్మూర్తి, 150 మంది సభ్యులు పాల్గొన్నారు.