24-09-2025 12:26:39 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి సెప్టెంబర్ 23 : దేశానికి వెన్నుముక లాంటి రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన వేరుశెనగ విత్తనాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడును సాధించాలన్నారు.
వేరుశనగ సాగు అధికంగా ఉండడంతో రైతులకు అధిక ఆదాయం వచ్చేలా నాణ్యమైన విత్తనాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి రైతుకు ఒక ఎకరానికి విత్తనాలు అందిస్తున్నామని , పండించిన పంటను మార్క్ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కల్వకుర్తి వెల్దండ మండలాల్లో సుమారు 3వేల మంది రైతులకు అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వాటిని విత్తుకొని విత్తనాభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీతో పాటు రైతుబంధు ఇవ్వడం జరిగిందని, సాగు చేసింది పంటలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూసామన్నారు. కార్యక్రమంలో ఏడిఏ కిరణ్ కుమార్, నాయకులు ఆనంద్ కుమార్, సంజీవ్ యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఏవోలు సురేష్, మంజుల, ఏఈఓలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులుపాల్గొన్నారు.