calender_icon.png 4 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్లను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

04-12-2025 01:24:27 AM

నిజామాబాద్, డిసెంబర్ 3 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) సెల్ ను జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం సందర్శించారు. ఎంసిఎంసి ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు.

ప్రింట్, ఎలక్ట్రా నిక్ మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ను సందర్శించి ఎన్నికల అంశాలకు సంబంధించి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. మానిటరింగ్ సెల్ ను తనిఖీ చేసి, నిఘా బృందాల పని తీరును పర్వేక్షిస్తున్న విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతకుముందు సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ జక్రాన్పల్లి మండలం అర్గుల్, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి,  నందిపేట మండలం వన్నెల్(కే), డొంకేశ్వర్ గ్రామ పంచాయతీలను సందర్శించి నామినే షన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అబ్జర్వర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, డీఆర్డీఓ సాయాగౌడ్,  ఎంసిఎంసి కమిటీ మెంబర్ సెక్రెటరీ ఎన్.పద్మశ్రీ, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్ ఉన్నారు.