04-12-2025 01:26:17 AM
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి
నిజామాబాద్, డిసెంబర్ 3 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు క్షమించలేనివని సీఎం వెంటనే హిందువుల క్షమాపణ చెప్పాలని నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు దినేష్ కులచారి డిమాండ్ చేశారు. నగరంలో బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాదు లోని నిఖిల్ సాయి చౌరస్తా లో నల్ల రబ్యాడ్జి లతో ధరించి నిరసన తెలిపారు .
ఈ సందర్బంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. గతంలో కెసిఆర్ హిందూ గాళ్ళు బొందుగాళ్ళు అంటే పాతలానికి పాతేషారాణి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు కు కాంగ్రెస్ పార్టీ కి కూడా అదే దుస్థితి పడుతుంది అన్నారు. కేవలం. ఒక వర్గం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ నాటకమని దినేష్ కులాచారి తీవ్రంగా గ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం మన్ననలు పొందడానికి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల సంప్రదాయమై పోయిందని ఆయన మండిపడ్డారు. హిందూ దేవతల్ని అవమానించి,
తర్వాత రాజకీయ లబ్ధి కోసం మళ్లీ జాగ్రత్తగా నటించడం రేవంత్ ఖాన్ స్టైల్ అని, కానీ ఈసారి హిందూ సమాజం మీ నాటకం నమ్మదు అని దినేష్ కులాచారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యత లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడటం చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితే వచ్చింది అని అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ భావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే, బీజేపీ జిల్లా వ్యాపాతంగా పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
‘హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ధైర్యం మీకు ఎవరు ఇచ్చారు? వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే మీ ప్రభుత్వమే ప్రజల కోపంతో కూలిపోతుంది’ అని దినేష్ కులాచారి స్పష్టం చేశారు.హిందూ సమాజాన్ని అవమానించే ఔట్డేటెడ్ రాజకీయాలు ఇక పనిచేయవని, ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు అస్సలు సహించరని అన్నారు.
మత రాజకీయాల మీద మాట్లాడే కాంగ్రెస్ హిందువులు రేవంత్ ఖాన్ మాట్లాడిన మాటలకూ నోరు లేవడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఆకుల శ్రీనివాస్, బూరుగుల వినోద్,ఇప్పకాయల కిషోర్,మల్లేష్ గుప్తా, గడ్డం రాజు, అంబదాస్ రావు, నారాయణ యాదవ్, గిరిబాబు,యాదల నరేష్,ఆమందు విజయ్ కృష్ణ,ఆనంద్, చిరంజీవి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.