22 April, 2026 | 12:36 PM

Breaking News

చివరి 72 గంటలు చాలా కీలకం

10-05-2024 12:12 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చివరి 72 గంటలు చాలా కీలకమైనవని, ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని హైదరాబాద్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ పిఐ శ్రీవిద్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఆర్‌ఓ, ఓసీపీ నోడల్ అధి కారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో చివరి 72 గంటలు చాలా కీలకమైనవని, ఎన్నికల కమిషన్ నియమనిబంధనల మేర కు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతం గా, ప్రశాంతంగా జరిగేలా ఏఆర్‌ఓలు, ఏసీపీలు, పోలింగ్ సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. హైదరాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఈవీఎంల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని వీడియో తీయాలని, శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాజకీ య ప్రచారాలు ముగించాలని ఆయన పేర్కొన్నారు.