17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్

04-02-2026 12:37 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యామ్ ప్రసాద్ లాల్ మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం, సెంట్ అగస్టిన్ హై స్కూల్ కౌంటింగ్ కేంద్రం ను పరిశీలించారు.

ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం అధికారులు పక్కాగా సౌకర్యాలను కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ముగిసే వరకు రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు త్రాగునీరు, చైర్స్, టెంట్స్, దివ్యాంగుల కోసం వీల్ చైర్స్, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైద్య బృందం ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రానికి తరలించే క్రమంలో రిటర్నింగ్ అధికారులు పోలీస్ భద్రతా సిబ్బంది మధ్య పోలింగ్ బాక్సులు తరలించాలని, అభ్యర్థులకు సంబంధించి ప్రచార ముందస్తు అనుమతులు, ఖర్చుల వివరాలు, తదితర అనుమతులను సమయం లోగా తీసుకునే విధంగా అభ్యర్థులకు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. జనరల్ అబ్జర్వర్ వెంట నోడల్ ఆఫీసర్ కృష్ణవేణి, స్థానిక మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఎన్నికల విభాగం అధికారులున్నారు.