04-02-2026 12:38:48 AM
12కు 12 స్థానాలు గెలిచి తీరుతాం
మున్సిపల్ చైర్మన్ పదవి కాయం చేసుకుంటాం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): యల్లారెడ్డి మున్సిపాలిటీ గత రెండేళ్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్. గత పాలకుల పాలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి చెందలేదని ప్రస్తుతం 18 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఎల్లారెడ్డిలో నెరవేరి నిధులు పెట్టి అభివృద్ధి బాటలో కొనసాగిస్తున్నామని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.
అనంతరం పాత్రికేయులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీ ప్రజల ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో, గత రెండేళ్ల కాలంలో నేను అనేక నిధులు తీసుకువచ్చి సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. మాటలకంటే పనులే నా రాజకీయ విధానం అన్నదానికి ఇవే సాక్ష్యం. ఈ కాలంలో యల్లారెడ్డి పట్టణంలో చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనులు:
ఆధునిక సౌకర్యాలతో నూతన బస్ స్టాండ్ నిర్మాణం పూర్తి, మినీ ట్యాంక్ బండ్ను అభివృద్ధి, అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికి తాగునీటి సరఫరా, యల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, గాంధీ చౌక్ అభివృద్ధి ఆధునిక లైటింగ్, రోడ్డు విస్తరణతో నూతన రూపం, అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి ఫౌంటెన్లు, ల్యాండ్స్కేపింగ్తో పట్టణానికి ప్రత్యేక గుర్తింపు
వార్డ్ ల వారీగా అభ్యర్థుల జాబితా:
1వ వార్డ్ : తుమ్మల గాయత్రీ శ్యామ్ సుందర్
2వ వార్డ్ : మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్
3వ వార్డ్ : కౌసర్ ఉన్నిసా రఫీక్
4వ వార్డ్ : దుంపల మంజుల శంకర్
5వ వార్డ్ : చంద్రయ్య అట్కరి
6వ వార్డ్ : సయ్యద్ గఫార్
7వ వార్డ్ : మతమాల భాగ్యవతి
8వ వార్డ్ : నునుగొండ శ్రీనివాస్
9వ వార్డ్ : గాదె తిరుపతి
10వ వార్డ్ : పద్మ శ్రీకాంత్
11వ వార్డ్ : రొడ్డ స్వప్న సాయిరాం
12వ వార్డ్ : ఎరకల దశరథం
కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బీఫారాలు అందజేసి గెరిపే లక్ష్యంగా పనిచేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణంలోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఏడో వార్డ్ అభ్యర్థి మత్తమాల భాగ్యవతికి బీఫామ్ అందజే
ఎల్లారెడ్డి ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): ఇంతకు ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో పురపాలక చైర్మన్ ఆయన అతను అనేదానిపై సందిగ్ధం రేగుతుంది. నాయకుల్లో మొదలైన గుబులు, అందరికీ పార్టీ తరఫున 12 మంది నాయకులకు బీఫాంలో అందినప్పటికీ పలువురు నాయకులు పార్టీ బీఫాంలో నేరుగా అందజేసిన అప్పటికీ చైర్మన్ పీఠంపై అతను ఆమెను అనే సందేశం నెలకొల్పుతుంది.
ప్రత్యేకంగా బీఫారాలు అందజేతలు పలువురు నాయకుల్లో ఆందోళన మొదలయ్యింది. యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ఎల్లవేళలా అందుబాటులో ఉండే యువకుడు మతమాల ప్రశాంత్ గౌడ్ తల్లి మతమాల భాగ్యవతికి బీఫామ్ అందజేసి ఎమ్మెల్యే మదన్మోహన్ కంగ్రాచులేషన్ తెలిపారు. ఆమెకు బీఫామ్ అందజేయడంతో పలువురి నాయకుల్లో చైర్మన్ పదవిపై సందిగ్ధం మొదలైంది.