16 August, 2026 | 11:10 PM

సాధారణ బదిలీలు కౌన్సెలింగ్ పద్ధతిలోనే జరగాలి

17-06-2024 12:47 AM
  • టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగుల సాధార ణ బదిలీలను కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసో సియేషన్ (టీజీవో) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గెజిటెడ్‌భవన్‌లో ఆదివారం అధికారుల కేంద్ర సంఘం కార్యవ ర్గంతో పాటు 54 విభాగాల జిల్లా  అధ్యక్ష, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144మంది ఉద్యోగులను తిరిగి రాష్ట్రా నికి తీసుకురావాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను  విడుదల చేయాలన్నారు.  అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మంత్రి వర్గ ఉప సంఘానికి, త్రిసభ్య కమిటీకీ అందజేస్తామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు బి.శ్యాం,ఉపాధ్యక్షుడు జగన్మోమోహన్‌రావు, కోశాధికారి ఎం.ఉపేందర్ రెడ్డి  పాల్గొన్నారు.