సివిల్స్ అభ్యర్థికి పోలీస్ భరోసా
- అసలైన పరీక్ష కేంద్రానికి బదులు మరో కేంద్రానికి వచ్చిన అభ్యర్థి
బైక్‌పై సరైన సమయానికి చేర్చిన కానిస్టేబుల్ సురేష్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): సివిల్స్ సాధించాలనే లక్ష్యం తో పరీక్ష రాయడానికి ఇంటి నుంచి బయల్దేరిన ఓ అభ్యర్థి సకాలంలో పరీక్షా కేంద్రా నికి చేరుకునేందుకు ఓ కానిస్టేబుల్ సహాయమందించారు. ఆదివారం నిర్వహించిన యూపీఎస్పీ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ అభ్యర్థిని తాను వెళ్లాల్సిన పరీక్ష కేంద్రానికి కాకుండా మరో పరీక్ష కేంద్రానికి వెళ్లింది. ఎగ్జామ్ సెంటర్‌లో ఆరా తీయగా పరీక్షా కేంద్రం వేరే చోట ఉందని, తెలిసింది. పరీక్షకు కొద్ది సమయం మాత్రమే ఉండటంతో ఏం చేయాలో తెలియ పరిస్థితుల్లో ఉన్న ఆమెకు సైబరాబాద్ పోలీసులు సహాయం అందించారు.
పరీక్ష సమయం దగ్గర పడుతుండటంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ తన బైక్‌పై రాజేంద్రనగర్‌లో ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చడంతో అభ్యర్థి పరీక్ష రాసింది. దీంతో, సరైన సమయానికి పరీక్ష కేంద్రంలో దింపిన కానిస్టేబుల్ సురేశ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ కమిషనరేట్ అధికారిక సోషల్ మీడి యా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తు తం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్ సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






