15 April, 2026 | 1:42 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

మున్సిపల్ పీఠాల్లో హస్తం పాగా

17-02-2026 12:55 AM

ఎక్స్ అఫీషియో ఓట్లతో హంగ్ ఏర్పడ్డ కేసముద్రం, వర్ధన్నపేట హస్తగతం

మహబూబాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు గాను సోమవారం నిర్వహించిన తొమ్మిది మున్సిపాలిటీల్లో అధ్యక్ష పీఠాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హస్త గతం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా , అధికార కాంగ్రెస్ ఎనిమిది, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ 8 వార్డు కౌన్సిలర్ స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది.

సోమవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెం దిన బానోతు సునీత చైర్ పర్సన్ గా, వైస్ చై ర్పర్సన్ డాక్టర్ అల్లం రమ ఎన్నికయ్యారు. ఇక ఇదే విధంగా వర్ధన్నపేటలో 12 వార్డులు ఉండగా 5 అధికార కాంగ్రెస్, ఆరు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, ఒక స్థానంలో గెలుపొందిన ఇం డిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు ఇ వ్వడంతో ఇక్కడ కూడా హంగ్ ఏర్పడింది. దీనితో ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజ్ ఎక్స్ అఫీషియో ఓటు తో కాంగ్రెస్ వర్ధన్నపేట మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ గా నేతావత్ షిభారాణి గెలుపు పొందారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న మరిపెడ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గా విసారపు ప్రగతి, వైస్ చైర్పర్సన్ గా కాలపు సునీత, ములుగు మున్సిపల్ చైర్ పర్సన్ గా చింత నిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ గా ఆషియా షాహిన్, భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా బుర్ర కొమురయ్య, వైస్ చైర్మ న్ గా అంబాల శ్రీనివాస్, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్మన్ గా నీలం రాజమ్మ, నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్పర్సన్ గా గంధం శ్రీధర్, మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా గుగులోతు జ్యోతి, వైస్ చైర్మన్ గా సూర్ణపు సోమయ్య, పరకాల మున్సిపాలిటీ చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య ఎన్నికయ్యారు.ఇక జనగామ, తొర్రూరులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవల కారణంగా మున్సిపాలిటీ చైర్ పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. అలాగే డోర్నకల్ మున్సిపాలిటీలో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.