17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రాహుల్, రేణుకా చౌదరిలకు ఇచ్చిన ఉల్లంఘన నోటీసులు వెనక్కి తీసుకోవాలి

17-02-2026 12:54 AM

మణుగూరు, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) :కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి  విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్, రేణుకా చౌదరిలకు ఇచ్చిన ఉల్లంఘన నోటీసులు వెనక్కి తీసుకోవాలని,బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద  పార్టీ శ్రేణులతో కలిసి మౌన ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ,కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబి స్తోందని  విమర్శించారు.  రాహుల్ గాంధీ, రేణుకా చౌదరిలపై జారీ చేసిన సభా ఉల్లంఘన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి  ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆరోపించారు. 

రేణుక అక్షర మహిళా   అధ్యక్షురాలు పూనం సరోజ, ఎండి షబానా,కోరి శ్యామల  డేరంగుల సుజాత, రెడ్డీబోయిన రేణుక, కన్నాపురం శైలజ, సౌజన్య డాకూరి, లక్కీశెట్టి హేమలత, సీనియర్ నాయకులు ఎండీ షేరిఫ్, పింగళి మాధవ రెడ్డి, వెంకట చారి, యువజన నాయకులు పార్టీ కార్యకర్తలు  పాల్గొన్నారు.