29-07-2025 11:52:34 AM
తుంగతుర్తి( విజయ క్రాంతి): తెలంగాణ జడ్జిల అసోసియేషన్(Judges Association) ఎన్నికల్లో కార్యవర్గ సభ్యుని గా మెజారిటీ తో గెలిచిన తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ పాషా గారిని తుంగతుర్తి బార్ అసోసియేషన్ మంగళవారం ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞాన సుందర్ మాట్లాడు తూ జడ్జి వచ్చిన తర్వాత కేసుల పరిస్కారం, రాకెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి . ఇది కక్షిదారులకు, న్యాయ వాదులకు సంతోష దాయకం. త్వరలలో నూతన కోర్టు బిల్డింగ్ శిల ఫలకం కూడా వేస్తాం. బిల్డింగ్ పనులను కూడా సాద్యమైనంత త్వరలో పూర్తి చేపిస్తాం. కక్షిదారులకు న్యాయవాదులకు,ఉద్యోగ సిబ్బంది ఇబ్బంది ఇక్కట్లు తొలగిస్తాం. సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు. వైస్ ప్రసిడెంట్ కారింగుల వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ పర్విన్ వజీర్,. జాయింట్ సెక్రటరీ రవికుమార్ సీనియర్ న్యాయవాదు టి. సత్యనాయణ, కుమారస్వామి స్వామి, జిలకర చంద్రమౌళి బి.రాజరామ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.