calender_icon.png 29 July, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారం,జంగాలపల్లి గ్రామాలకు వైన్ షాపు ఏర్పాటు చేయాలి

29-07-2025 11:50:46 AM

వాజేడు, (విజయక్రాంతి): నాగారం గ్రామపంచాయతీ పరిధిలో గల నాగారం, జంగాలపల్లి గ్రామాలకు పెసా గ్రామసభ నిర్వహించి మద్యం షాపును(Wine shop) ఏర్పాటు చేయాలని వాజేడు మండలం ప్రత్యేక అధికారి సర్దార్ సింగ్, ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు లకు పీసా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. వాజేడు మండల కేంద్రంలో గల నాగారం పంచాయతీలో నాగారం జంగాలపల్లి గ్రామాలలో ఎస్టీ కోయ ప్రజానీకం అధికంగా ఉన్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా వాజేడులో మద్యం షాపు నిర్వహిస్తూ దాని నుండి వచ్చే ఆదాయము మా గ్రామాలకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అందువలన జంగాలపల్లి , నాగారం గ్రామాలకు మద్యం షాప్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగారం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, పేసా కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.