హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) శనివారం కీలక ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కూల్చివేతలు చేపట్టింది. పోలీసు బలగాల పహారా నడుమ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రత్యేక చర్యలో, పాదచారుల మార్గాల్లోని ఆక్రమణలను తొలగించడం జరిగింది. బడంగ్‌పేట, సంతోష్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, కార్వాన్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, కవాడిగూడ, శంషాబాద్, చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్‌ల పరిధిలోని ప్రాంతాల్లో కూల్చివేతలను చేపట్టబడింది.
GHMC పరిధిలో పాదచారుల మార్గాల ఆక్రమణల విషయంలో అత్యంత కీలకమైనవిగా గుర్తించిన అన్ని ప్రాంతాల్లోనూ GHMC ఎర్త్ మూవర్లను మోహరించింది. వీటిలో కండికల్ వంతెన నుండి ఛత్రి నాక కూడలి వరకు, ఆరామ్‌ఘర్ ప్రాంతం, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్ ప్రాంతాలు, కాచిగూడ కూడలి, మహేశ్వరి-పరమేశ్వరి థియేటర్, సుల్తాన్ బజార్, ఆంధ్ర బ్యాంక్ సిగ్నల్ (సుల్తాన్ బజార్) సమీపం, గాంధీ ఆసుపత్రి, పద్మారావు నగర్ ఉన్నాయి. కూల్చివేతలపై తమకు సరైన సమాచారం ఇవ్వలేదని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






