15 August, 2026 | 1:45 AM

రాష్ట్రపతి అవార్డు అందుకున్న రామయ్య

15-08-2026 01:14 AM

సుల్తానాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ప్రాచీన కడ్డీ తంత్రి వాయి ద్యం, జడ కొప్పులాట కళాకారుడు దుర్శేటి రామయ్య రాష్ట్రపతి ద్రౌపది మురము చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. కళా రంగంలో రామయ్య చేసిన కృషికి జాతీయ సంగీత నాటక అకాడమీ 2024 సంవత్సరానికి గాను అవార్డు ప్రకటించారు, తాజాగా రాష్ట్రపతి అవార్డును అందజేశారు, గతంలో రామయ్య జానపద సంగీతానికి ఎన్నో సేవలు అందించగా అనేక అవార్డులు పొందారు... రామయ్యకు రాష్ట్రపతి అవార్డు రావడం పట్ల శుక్రవారం గర్రెపల్లి గ్రామ ప్రజలతో పాటు, పెద్దపల్లి జిల్లాలోని పలువురు కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.