15 August, 2026 | 2:48 AM

ఎరువుల దుకాణాలపై అధికారుల ఆకస్మిక దాడులు

15-08-2026 01:13 AM

ధర్మపురి, ఆగస్టు 14 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన ఎరువులు, సరైన ధరలకే అందేలా చూడటమే లక్ష్యంగా ఎండపల్లి మం డల కేంద్రంలో తహసీల్దార్ ఎడ్ల అనిల్ కుమా ర్, మండల వ్యవసాయ అధికారి కామల్ల మహేష్ లు పలు ఫెర్టిలైజర్ దుకాణాలపై శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా దుకాణాల్లోని నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించా రు. దుకాణాల్లోని భౌతిక నిల్వలకు, రిజిస్టర్లలోని వివరాలకు తేడాలు ఉంటే కఠిన చర్యలు ఉంటాయని వ్యాపారులను హెచ్చరించారు. ఎంఆర్ పి కంటే ఎక్కువ ధరలకు విక్రయించిన, కృత్రిమ కొరత సృష్టించినా చట్టరీత్యా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. రైతులకు ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని అధికారులు వ్యాపారులకు సూచించారు.