01-11-2025 09:28:51 AM
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation)కి చెందిన 51 ఏళ్ల పారిశుధ్య కార్మికురాలిపై ఎర్రగడ్డ ప్రాంతంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై(Erragadda Foot Over Bridge) అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన నంబూరి రాజు (45)ను బోరబండ పోలీసులు (Borabanda Police) అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బాధితురాలు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఏజీ కాలనీలో తన క్లీనింగ్ విధులకు వెళుతుండగా.. రద్దీగా ఉండే హైవేను దాటడానికి, ఈఎస్ఐ ఆసుపత్రికి సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించింది. ఆ మహిళను నిందితుడు రాజు అడ్డగించాడని, ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడని తెలుస్తోంది. మోడల్ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న రాజు, ఫుట్‌బ్రిడ్జిపై మహిళను నిర్బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.