01-11-2025 08:48:24 AM
తల్లి ముందు ప్రిన్సిపల్ తిట్టారనే మనస్తాపం
డెటాల్ తాగిన బాలిక
పరిస్థితి విషమం.. దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దేవరకొండ మండలం(Devarakonda Mandal) పెంచికల్ పహాడ్ ఎస్సీ బాలికల గురుకులంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను మౌనికగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక విద్యార్థిని ఇంటికి వెళ్లింది. నిన్న తన తల్లితో కలిసి విద్యార్థిని గురుకుల పాఠశాలకు వచ్చింది. తన తల్లి ముందే ప్రిన్సిపల్ తిట్టిందనే మనస్తాపంతో బాలిక డెటాల్ తాగింది. పరిస్థితి విషమించడంతో బాధిత విద్యార్థినిని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.