calender_icon.png 1 November, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్య

01-11-2025 09:39:21 AM

తల, సగం వరకు కుడిచేయి లేకుండా మృతదేహం.

బాసరకు వెళ్లే రోడ్డులో వివస్త్రగా కనిపించిన మహిళ డెడ్ బాడీ.

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా(Nizamabad district) నవీపేట్ మండలం మిట్టాపూర్ వద్ద మహిళ దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండగులు చంపేశారు. బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా మహిళ మృతదేహం కనిపించింది. తల, కుడిచేయి మణికట్టు వరకు లేకుండా మృతదేహం కనిపించింది. వేరే ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళ వయసు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.