25 May, 2026 | 4:18 PM

తాయిలాల ఎర

18-04-2024 02:27 AM

l పార్టీలో చేరితే పైసలు.. పదవుల ఆశ 

l ఉదయం ప్రచారం.. రాత్రి విందు, వినోదాలు

l దావాత్‌లతో మచ్చీక చేసుకొంటున్న నేతలు

l ఎలాగైన గెలిచేందుకు నేతల పడరాని పాట్లు


రంగారెడ్డి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది తమ ప్రచారాలను ముమ్మరం చేస్తు న్నారు. ఆయా పార్టీల తరపునా పోటీలో నిలబడిన నేతలు ఉదయం తమ షెడ్యూల్ ప్రకా రం ప్రచారాలను చేస్తూనే రాత్రి వేళలో విందులు, వినోదాలకు తెరలేపారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మండ లాలు, గ్రామాలు, మున్సిపాలిటీలో వార్డుల వారీగా విభజించుకొని ప్రణాళికబద్ధంగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఓటర్లలో మంచి పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారిని పార్టీలో చేర్చుకొనేందుకు వారికి తాయిలాల ఎర వేస్తున్నారు.

భవిష్యత్‌లో పార్టీలో మంచి హోదా కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉంటామని నేతలు భరోసా కల్పిస్తున్నారు. ప్రధానంగా యువత, మహిళ, వృద్ధుల ఓట్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కాలనీలు, విల్లాలు క్లాస్ ఏరియాలో ఒక విధానం, మాస్ ఏరియాలో ఒక విధానాన్ని అమలు చేస్తు ఓట ర్లను తమ వైపు తిప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా పార్ల మెంట్ పరిధిలోని ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ, కార్మిక సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

రాత్రి వేళలో కాలనీల ప్రెసిడెంట్‌లు, ఉద్యోగస్తులు, పలుకుబడి నేతలకు ప్రత్యేకంగా దావాత్‌లు ఏర్పాటు చేస్తూ మద్యం, విందులను ప్రతినిత్యం ఏర్పాట్లు చేస్తున్నారు. మరోక వైపు తమ పార్టీలో ఉన్న నేతలను సమన్వయం చేసుకుంటూ ఆయా నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారికి ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ నిత్యం ప్రచారాలకు కలిసి వచ్చే కార్యకర్తలకు మంచి చెడ్డలు చూసుకొంటున్నారు.

పోటాపోటీగా ప్రచారాలు

చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి  బలమైన అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ తమకు మద్దతు తెలిపేలా వారిని ఆకర్శించే పనిలో నిమగ్నం అయ్యారు. ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరూ కూడా ఖర్చుకు వెనక్కి తగ్గుతాలేరు.

పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండు రూ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలు అన్ని సెమీ అర్బన్ ఏరియాలోకి వస్తాయి. దీంతో ఎన్నికలో అభ్య ర్థులకు ఖర్చు తడిసి మోపడయ్యే అవకాశా లు ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు తగ్గేది లేదంటూ వినూత్నంగా ప్రచా రం చేయడంతో పాటు పార్టీలో చేరికలను ముమ్మరం చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

ఫంక్షన్‌హాలు, రిసార్టుల అడ్వాన్స్ బుక్కింగ్‌లు

పార్లమెంట్ పరిధిలోని పలు పంక్షన్‌హాలు, రిసార్టులు, వైన్ షాపులను ముందస్తుగా అభ్యర్థులు వచ్చెనెల వరకు బుకింగ్‌లు చేసుకొని అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని బంధుమిత్రులు ఇళ్లలోకి వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాలు చేస్తు వారికి మర్యాదలు చేస్తున్నారు. ఇప్పటికే కిందిస్థాయి చోటా మోటా లీడర్లకు పార్టీ అభ్యర్థుల తరపునా బలమైన హామీలు ఇవ్వడంతో వారంతా తమ పరిధిలోకి వచ్చే ఓటర్లను నిత్యం పలకరిస్తూ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపేలా వ్యహరాలను చక్కబెడుతున్నారు.

మద్యంపై ప్రత్యేక ఫోకస్

ఎన్నికలో మద్యంది ప్రధాన పాత్ర అనే చెప్పాలి. ప్రచారం అనంతరం కార్యకర్తలు, నాయకులకు మందు పార్టీతో మంచి చెడ్డ తప్పక చేయాల్సిందే. లేదంటే ఇతర పార్టీల నేతల వెంటా పోతారని ఆందోళన ఆయా పార్టీల నేతలను వెంటాడుతుంది. దీంతో ఎన్నికలు ముగి సే వరకు వారికి తప్పనిసరిగా మందు పంపకాలు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మద్యం కొరత రాకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకొనే పనిలో ఆయా పార్టీ ల నేతలంతా బిజీ బిజీగా ఉన్నారు.

అయి తే ఎన్నికల అధికారులకు ఎక్కడ మద్యం దొరకకుండా తమకు నమ్మకస్తుల వ్యక్తు ల ద్వారా మద్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకొంటున్నారు. గ్రామా లు, పట్టణాల్లో ప్రత్యేక స్థావారాలను ఏర్పాటు చేసుకొని మద్యం నిల్వలు చేసుకొని రోజువారిగా పంపకాలను పకడ్బం దీగా చేస్తున్నారు.