జహీరాబాద్‌లో హోరా హోరీ
సంగారెడ్డి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పోటీలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీబీ పాటిల్ హ్యాట్రిక్ సాధించేందుకు జోరుగా ప్రచారం చేస్తున్నా రు. నామినేషన్‌కు ముందుగానే పార్లమెంట్ పరిధిలో ఉన్న మండలాలు, ముఖ్యమైన గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలు గురించి వివరించి ఓట్లు అడుగుతున్నారు.
అలాగే జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్‌ఎస్ నుంచి గాలి అనిల్‌కుమార్ బరిలో దిగారు. గెలుపుకోసం మూడు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్‌కు చెందిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సె స్ కావడంతో పార్టీ నేతలు గెలుపు ఖాయమంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచారమే ప్రారంభించలేదు. పార్లమెంట్ పరిధిలో ఉన్న లింగా యత్ సామాజిక వర్గం పెద్దలను కలిసి కాం గ్రెస్‌కు ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఎక్క డ కూడా నాయకులు, కార్యకర్తల సమావేశా లు ఏర్పాటు చేయలేదు. పార్లమెంట్ పరిధిలోని మైనార్టీలు, ఎస్సీలను పట్టించుకో వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజల వద్దకు బీజేపీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి మారిన బీబీ పాటి ల్‌కు టికెట్టు దక్కడంతో మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయాత్నిస్తున్నాడు. జహీరాబాద్ ఎంపీగా మూడోసారి విజయం సాధిం చేందుకు బీబీపాటిల్ ప్రజల వద్దకు వెళ్లి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా రు. నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు.






