జనతా నగర్‌లో బాలిక ఆత్మహత్య
బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య
కూకట్‌పల్లి, జులై 16 (విజయ క్రాంతి): మూసాపేట్ జనతా నగర్‌లో 14 సంవత్సరాల బాలిక తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన త్రిలోచన్ సాహు నిర్మల సాహూ గత కొన్ని సంవత్సరాల క్రితం మూసాపేట్ జనతా నగర్‌కు వచ్చి నివాసం ఉంటున్నా రు. త్రిలోచన్ కుమార్తె సమీపంలోని ఎస్ ఎం మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.
అదే పాఠశాలలో పార్ట్ టైం టీచర్ గా నరేష్ గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలికకు నరేష్ కు సాన్నిహిత్యం ఏర్పడి సామాజిక మాధ్యమం ద్వారా చాటింగ్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి నరేష్ కు మరోసారి అమ్మాయితో సంభాషించకూడదని వార్నిం గ్ ఇచ్చారు. అప్పటినుండి నరేష్ ఆ బాలిక ను దూరం పెట్టడం ప్రారంభించాడు.
దాం తో మానసికంగా కృంగిపోయిన బాలిక నా తో మాట్లాడడం లేదంటూ నరేష్ కు వీడి యో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో కాల్ లో చూడాలంటూ సమాచారం ఇచ్చింది. వెంటనే నరేష్ బాలిక బంధువులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని నాకు వీడియో కాల్ చేసిందని సమాచారం ఇచ్చాడు. సమాచా రం అందుకున్న బంధువులు అమ్మాయి గ దిలోకి వెళ్లి చూడగా అమ్మాయి అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
స్థానికులు పోలీసులకు సమాచా రం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప త్రికి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.






