25 July, 2026 | 8:06 PM

Breaking News

ప్రియురాలి బ్రేకప్.. ప్రియుడి ట్విస్ట్

31-05-2024 01:33 AM

ఇప్పటివరకు ఆమెపై పెట్టిన ఖర్చులను జీఎస్టీతో సహా చెల్లించాలని కోరిన ప్రియుడు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) :  సాధారణంగా ప్రేమ విఫ లం అయిన తర్వాత అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం మానేస్తారు. ఒకరిపై ఒక రు కోపం పెంచుకుంటారు. అయితే  కలిసి ఉన్నప్పుడు చేసిన ఖర్చులను విడి పోయిన తర్వాత పెద్దగా పట్టించుకోరు. కానీ సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) చదివిన ఓ ప్రియు డు తాను ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్ప డంతో  ఇప్పటివరకు ఆమెపై పెట్టిన ఖర్చు లు (రూ.60,635) జీఎస్టీతో సహా కలిపి చెల్లించాలని కోరాడు.

ఈ నేపథ్యంలో ప్రియురాలికిపై తాను ఇప్పటివరకు చేసిన ఖర్చులు వివరిస్తూ ఎక్సెల్ షీట్ తయారు చేసి డబ్బును తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆ లిస్ట్‌లో ఇద్దరు కలిసి ప్రయాణిం చిన క్యాబ్ ఖర్చులు, సినిమా, కాఫీ తాగడం మొదలైన ఖర్చుల వివరాలను చూపాడు. డబ్బు చెల్లించడానికి ఈఎమ్‌ఐ సదుపా యం కూడా కల్పించాడు. డబ్బులు తిరిగి చెల్లించడం ఆలస్యమైతే, నెలకు 4 శాతం వడ్డీ చెల్లించాలని కోరడం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడు తోంది.