2 July, 2026 | 3:31 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

పాటల పల్లకిలో గర్ల్‌ఫ్రెండ్

14-07-2025 02:09 AM

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ అందమైన ప్రేమకథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్  త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పాటలతో ప్రమోషన్స్‌లో జోరు పెంచనున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘నదివే..’ లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను ఈ నెల 16న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్; సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్.