14-07-2025 02:10:48 AM
రాధాకృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో కిరీటిరెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. “కిరీటీ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ‘జూనియర్’ టీజర్, ట్రైలర్, పాటలు చూశాను.
కిరీటి చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు. తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కిరిటి రూపంలో మరో ప్రామిసింగ్ స్టార్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. తను డాన్స్‌లో సూపర్ సీనియర్ అనిపిస్తున్నారు. శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. కిరీటికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి” అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కిరీటిపై అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ” అన్నారు.
హీరో కిరీటి మాట్లాడుతూ.. “శివన్న గారు, అప్పు గారు నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి. నాకు ఇంత మంచి సినిమాతో లాంచ్ చేస్తున్న నిర్మాత సాయి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను.”అన్నారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. “జూలై 18న ఈ సినిమా వస్తుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అన్నారు. నటీనటులు రవిచంద్రన్, జెనీలియా, డీవోపీ సెంథిల్‌కుమార్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.