ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష
24-04-2026 12:00 AM
- ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం.. పెళ్లి అనగానే ముఖం చాటేసిన వైనం
- న్యాయం చేయాలంటూ పోరాటం
పాల్వంచ, ఏప్రిల్ 23, (విజయక్రాంతి): ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఆరు సంవత్సరాలుగా శారీరకంగా ఆర్థికంగా వాడుకొని, పెళ్లి విషయం ఎత్తగానే ముఖం చాటేసాడని పాల్వంచకు చెందిన ఓ మహిళ గురువారం ప్రియుడి అంటే ముందు దీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే బొల్లోరు గూడెం ప్రాంతానికి చెందిన రావూరి శ్రీరామ్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో మోసం చేశారని ఆమె ఆరోపించారు. పెళ్లి మాట ఎత్తగానే అబ్బాయి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు తల్లి జ్యోతి ఆరోపిస్తోంది. ఇరు వర్గాలు పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.






