ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు
మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత
మధిర, ఏప్రిల్ 23(విజయ క్రాంతి): మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత గురువారం విస్తృతంగా పర్యటించారు. వార్డులో నెలకొన్న పలు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమె, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్కు, మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి సమస్యను సమయానికి పరిష్కరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ పర్యటనలో 8వ వార్డ్ కౌన్సిలర్ యన్నం కోటేశ్వరావు, ఒకటో వార్డ్ కౌన్సిలర్ దోర్నాల శిరీష, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, 1వ వార్డ్ డివిజన్ అధ్యక్షుడు దోర్నాల నాగ మురళి, వార్డు పెద్దలు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి ముందడుగు వేస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి పర్యటనలు తరచుగా నిర్వహించాలని కోరుకున్నారు.






