calender_icon.png 10 May, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణం ఇవ్వండి మహాప్రభో !

10-05-2025 02:59:28 AM

  1. ‘ఎక్స్’లో పాక్ పోస్ట్.. కొద్దిసేపటికే తొలగింపు 
  2. ఖాతా హ్యాక్ అయిందని బుకాయింపు

న్యూఢిల్లీ, మే 9: ‘మా దేశానికి ఆర్థిక సాయం చే యండి’ అంటూ పాక్ ఆర్థికశాఖ ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ కొద్ది నిమిషాల పాటు కనిపించింది. ఇంతలో నే తమ పరువు పో తుంది.. అని భావించిందేమో అక్కడి ప్రభుత్వం. నిమిషాల్లో ఆ పోస్ట్‌ను డిలీట్ చే యించింది. పైగా.. సదరు ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయిందని నాలిక కరచుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని జీర్ణించుకోలేని పాక్ ప్రభుత్వం మన దేశంలో పలుచోట్ల దాడులకు తెగబడుతున్నది. తన అమ్ములపొదిలో ఉన్న డ్రోన్లను ప్రయోగిస్తున్నది.

అయితే.. భారత సైన్యం ఎప్పటికప్పుడు ఆ డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేస్తున్నది. ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వానికి అత్యవస రంగా నిధులు అవస రమయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది. బిక్కము ఖం వేసుకుని ఐఎంఎఫ్ కోసం ఎదురుచూస్తున్నది. తాజాగా ‘ఎక్స్’లో సాయం కోసం పోస్ట్ పెట్టి, వెనువెంటనే డిలీట్ చేయించింది. పైగా.. ఖాతా హ్యాక్ అయిందని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నది.