10-05-2025 03:05:13 AM
పాక్ రుణం ప్రతిపాదనలపై అభ్యంతరాలు
న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్‌కు ఎక్సెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్‌ఎఫ్) ప్యాకేజీ ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిర్వహించిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. పాక్ రుణానికి సంబంధించి ఐఎంఎఫ్ శుక్రవారం ఓటింగ్ నిర్వహిం చింది. మరోవైపు పాకిస్థాన్‌కు రుణ ం ఇవ్వొద్దని భారత్ ఐఎంఎఫ్‌కు విజ్ఞ ప్తి చేసింది.
రుణం మంజూరుపై అనే క అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ ఇచ్చే రుణాన్ని భారత్‌లోని సైనిక, గూఢచార వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని పేర్కొన్నది. పాక్ 2023 లో ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ రుణం పొందింది. ౧ బిలియన్ యూఎస్ డాలర్ల రుణం మంజూరైనట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.