17 April, 2026 | 8:23 PM

నల్ల బ్యాడ్జీలతో నిరసన

17-04-2026 06:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కార కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం నిర్మల్ జిల్లా ట్రెజరీ ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలతో కార్యాలయంలో హాజరై ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు రమేష్ అజయ్ సృజన్ తదితరులు ఉన్నారు.