calender_icon.png 10 May, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చండీగఢ్‌లో అత్యవసర సైరన్

10-05-2025 02:55:31 AM

చండీగఢ్, మే 9: పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగపడుతున్న నేపథ్యంలో చండీగఢ్ యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవా రం ఉదయం నగరవ్యాప్తంగా ఐదు నిమిషాల పాటు సైరన్ మోగించి నగరవాసులను అప్రమత్తం చేసింది. అత్యవసర సమయాల్లో నగరాన్ని బ్లాక్‌అవుట్ చేసే అవకాశం ఉందని, అలాంటి సమయంలో సైరన్ మోగిస్తామని ప్రకటించింది. దాడుల స మయంలో ప్రజలెవరూ ఇంటి నుం చి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. డాబాలపై నించోవడం, బాల్కనీకి రావడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నది.