లైఫ్ సైన్సెస్‌కు గ్లెన్‌మార్క్ ఫార్మా గుడ్‌బై

11-07-2024 02:07:34 AM

ముంబై, జూలై 10:  గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ నుంచి గ్లెన్‌మార్క్ ఫార్మా పూర్తిగా వైదొలగనుంది. గతంలో గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్‌లో 75 శాతం వాటాను నిర్మా కంపెనీ రూ. 5,651 కోట్లకు కొనుగోలు చేసింది. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఒక్కో షేరుకు రూ.615 ధరతో ఈ లావాదేవీ జరిగింది. ఈ విక్రయం తర్వాత గ్లెన్‌మార్క్ ఫార్మా వద్ద ఇంకా 7.84 శాతం వాటా ఉన్నది. ఈ వాటాను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో స్టాక్ ఎక్సేంజీల్లో విక్రయించడానికి తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని గ్లెన్‌మార్క్ ఫార్మా బుధవారం తెలిపింది. రూ.810 ఫ్లోర్ ధరపై జూలై 11, 12 తేదీల్లో ఈ విక్రయం జరుగుతుందని పేర్కొంది. ఈ డీల్ విలువ రూ.778 కోట్లు ఉంటుంది.  ఈ వార్త నేపథ్యంలో బుధవారం గ్లెన్‌మార్క్ ఫార్మా షేరు 1.44 శాతం లాభపడి రూ.1,379 వద్ద ముగిసింది.