4 July, 2026 | 1:27 AM

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో గ్లోబల్ స్థాయి విద్య

04-07-2026 12:44 AM
  1. పేద విద్యార్థులకు పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియం
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  3. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి

గరిడేపలి/హుజూర్‌నగర్/కోదాడ, జూలై 3 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యా ర్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన విద్య ను అందించే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి   రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహాతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు  గ్లోబల్ ప్రమాణా లతో కూడిన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటె డ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జులై వరకు పాఠశాల నిర్మాణం పూర్తి చేస్తామని సంబంధిత కాంట్రాక్టర్ చెప్పగా, వచ్చే ఏడాది మే నెల చివరి వరకు పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్‌ని కోరారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఈ పాఠశాల ద్వారా మెరుగైన విద్యను అం దిస్తూ విద్యా ప్రమాణాలు పెంపొందించి అవకాశం కలుగుతుందన్నారు. పలు రోడ్ల ను మంత్రి ప్రారంభించారు.

కార్యక్రమంలో కోదా డ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, హుజూర్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, గరిడేపల్లి ఇన్చార్జ్ తహసీల్దార్ స్రవంతి, సీఐ చరమందరాజు, ఎస్‌ఐ శ్రీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మాజీ ఎం పీపీ పైడిమరి రంగనాథ్, మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్‌గౌడ్, సర్పంచు లు బచ్చలకూరి శ్రీను, కడియాల పద్మ అప్పయ్య, ఆరే కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బచ్చలకూరి కృష్ణ, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుండు రామాంజి తదితరులు పాల్గొన్నారు. 

ఆగస్టు 15న డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం

హుజూర్‌నగర్‌లో డిగ్రీ కళాశాలను ఆగస్టు 15 న ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రూ 4.50 కోట్లతో 12 గదుల నిర్మా ణం చేస్తున్న డిగ్రీ కళాశాలను,రూ 7.25 కోట్లతో 20 గదుల నిర్మాణం చేస్తున్న జూనియర్ కళాశాల పనులను పరిశీలించారు. రెవెన్యూ శాఖలో కారు ణ్య నియామకాల కింద ఎంపికైన ముగ్గురు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.  ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, తదితరులు, పాల్గొన్నారు

ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి 

-కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి,  ఆగస్టు 15 లో టగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదే శించారు.కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, సూపర్డెంట్ డాక్టర్ దశరథ్, నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.