5 June, 2026 | 12:59 PM

వైభవంగా నారా రోహిత్ నిశ్చితార్థం

14-10-2024 12:10 AM

నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కనున్నారు. ‘ప్రతినిధి 2’ చిత్రంలో కథానాయికగా నటించిన సిరీ లెల్లను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఆదివారం ఉదయం వీరి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం వైభవంగా జరిగింది.

వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ప్రతినిధి 2’ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.