calender_icon.png 8 June, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందీ వచ్చని వారికి చెప్పలేదు

14-10-2024 12:09:59 AM

బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ 1920 చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. హారర్ జానర్‌లో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీ చిత్రీకరణ నాటి విశేషాలను తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో తనను చూసి చాలా మంది విదేశీ నటి అని భావించారట. అసలు ఆదా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే.. “1920 చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం లండన్‌లో జరగడంతో అక్కడ ఎండ అనేదే కనిపించేది కాదు.

పైగా విపరీతమైన చలి. అప్పుడు నేను బ్లూ లెన్స్ పెట్టుకోవడంతో నన్ను చూసిన వారంతా విదేశీ అనుకున్నారు. అసలు హిందీయే నాకు రాదనుకున్నారు. చాలా కాలం అదే భ్రమలో ఉండిపోయారు. నేను కూడా వారికి భారతీయురాలినని, హిందీ వచ్చని చెప్పలేదు” అని తెలిపింది. ఆదా నటించిన రీటా సాన్యల్ వెబ్ సిరీస్ అక్టోబర్ 14న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.