calender_icon.png 3 November, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు

02-11-2025 06:16:07 PM

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి. రవీంద్ర నాయక్..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్యాధికారులు సిబ్బంది వచ్చే వారం రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి .రవీంద్ర నాయక్ ఆదేశించారు. ఆదివారం హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఏ. అప్పయ్య, డాక్టర్ బి. సాంబశివరావులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలు అమరావతి నగర్, ప్రగతి నగర్ లను సందర్శించారు. వైద్య శిబిరములను పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ నీటి నిలువ ఉండడం, నీరు, ఆహార పదార్థాలు కలుషితం కావడం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వారం రోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇంటింటి సర్వే నిర్వహిస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తూ అవసరమైన వారిని పిహెచ్సికి రిఫర్ చేయాలని అని అన్నారు. కలుషితమైన నీరు, ఆహార పదార్థాల ద్వారా డయేరియా, డీసెంట్రీ వంటి వ్యాధులు రాకుండా ప్రజలకి త్రాగునీరు, తినే ఆహార పదార్థాల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలని అన్నారు. మున్సిపల్ ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజారెడ్డి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

వరంగల్ వరద ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండ డిఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ ఉండాలని అని అన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్  డిఎంహెచ్ఓ లు డాక్టర్ ఏ.అప్పయ్య, డాక్టర్ బి. సాంబశివరావు, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ టి. మదన్మోహన్రావు, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇక్తదార్ అహ్మద్, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, వరంగల్ డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య, డాక్టర్ మోహన్ సింగ్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ ఉదయరాజ్, డాక్టర్ నవీన్, వడ్డేపల్లి పిహెచ్సి డాక్టర్ మాలిక, తదితరులు పాల్గొన్నారు.