8 May, 2026 | 12:20 PM

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

10-12-2024 10:45 PM

భైంసా (విజయక్రాంతి): దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాల చేయూత అందిస్తుందని వారు ఆత్మ విశ్వాసంతో ముందుకు నడవాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. భైంసాలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు ఎవరి దయపై బతకాల్సిన అవసరం లేదన్నారు. వారికి హక్కులు ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సదరం, యూఐడీఐ గుర్తింపుకార్డులు అందిస్తూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందని, సంక్షేమ పథకాలు, పింఛన్లు, అర్హులైన వారికి ట్రైసైకిళ్లు, బ్యాటరీవాహనాలు, అవసరమైన పరికరాలను అందజేస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు చేయుత అందిస్తున్నాయన్నారు. దివ్యాంగులను గుర్తించేందుకు జిల్లా కేంద్రంతో పాటు భైంసాలో సదరం శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీనియర్ వైద్యుడు డా.దామోదర్‌రెడ్డి, స్నేహ సొసైటీ డైరెక్టర్ సిద్దయ్య, భైంసా ప్రతినిధి డా.మహిపాల్, దివ్యాంగులు పాల్గొన్నారు.