calender_icon.png 14 May, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవభక్తి సన్మార్గంలో నడిపిస్తుంది

12-05-2025 02:15:54 AM

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ మే 11 (విజయ క్రాంతి) : దైవభక్తి సన్మార్గంలో నడిపిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పటానికి సమీపంలో ఉన్న పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దగ్గర కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయా న్ని   మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించడంతోపాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ  అందరిపైనా స్వామి వారి అనుగ్రహం మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి  అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు.  అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్ తదితరులు ఉన్నారు.