12-05-2025 02:13:43 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ మే 11 (విజయ క్రాంతి) : జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత వారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీ ఏర్పాటు కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి, కొత్తగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి , శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవనం ఆధునీకరణ కోసం ఆర్ అండ్ బి అధికారులతో ఎస్టిమేట్స్ చేయించాలని సూచించారు.
మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ కు రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చే విధంగా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పనిచేయాలని, రాజకీయాలకు అతీతంగా, సామాన్యులకు అండగా ఉంటూ, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయంగా పనిచేయాల్సిన బాధ్యత నూతన కమిటీ భుజస్కంధాలపైన ఉందని ఆయన స్పష్టం చేశారు. సమాజ హితమైన వార్తల పైన దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ చారి, ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, కోశాధికారి యాదయ్య, ఉపాధ్యక్షులు చింతకాయల వేంకటేశ్ , ధరణి, సంయుక్త కార్యదర్శులు సతీష్ కుమార్, కృష్ణ, మణి ప్రసాద్, ఇసి సభ్యులు రవి కుమార్, రామకొండ, షాబూద్దిన్, అహాద్ సిద్ధికి, బ్యూరో ఇన్చార్జిలు ఆంద్రజ్యోతి రవీందర్ రెడ్డి, సాక్షి కిషోర్ కుమార్, సూర్య శివకుమార్, నమస్తే తెలంగాణా వేంకటేశ్వర్ రావు, మన తొలి వెలుగు మధుసూదన్ రావు , తదితరులు పాల్గొన్నారు.