12-05-2025 02:17:39 AM
అచ్చంపేట, మే 11: నల్లమల అడవిలోని ఫర్హాబాద్ వ్యూపాయింట్ సమీపంలో ఆదివారం పర్యాటకులకు అతి సమీపంలో పెద్దపులి కంటపడింది. ఫరహాబాద్ వ్యూ పాయింట్ చూసేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో ప్రయాణిస్తున్న క్రమంలో పెద్దపులిని చూసిన పర్యాటకులు తమ సెల్ఫోన్లో వీడియోని బంధించారు.
ఈ ప్రాంతంలో పెద్దపులి ఇప్పటికే పలుమార్లు దర్శనం ఇచ్చినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. కానీ ఆదివారం పర్యాటకులు అతి సమీప నుంచి పెద్దపులిని చూడడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.