రూ.79 వేల దిగువకు బంగారం
17-12-2024 12:00 AM
న్యూఢిల్లీ: వరుసగా రెండో సెషన్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,150 క్షీణించి రూ.78,350లకు చేరుకున్నది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.79,500 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,150 నష్టంతో రూ.77,950 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో కిలో వెండి ధర రూ.4,500 తగ్గితే, తాజాగా సోమవారం రూ.300 పతనమై రూ.92,500లకు చేరుకున్నది. శుక్రవారం కిలో వెండి ధర రూ.92,800 వద్ద స్థిర పడింది. మార్కెట్లో అనిశ్చితికి తోడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి.




