27 July, 2026 | 8:53 PM

Breaking News

సహకార సంఘాల ఎన్నికల సందడి   •   ఎస్సీ హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించాలి   •   అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   అధ్యాపకుడి మృతిపై సంతాప సభ   •   పీఎంఈజీపీ రుణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి: బీజేపీ నేతల డిమాండ్   •   నూతన జిల్లా జడ్జికి ఘన స్వాగతం.. ఇన్‌చార్జి జడ్జికి వీడ్కోలు   •   తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఆకారపు జయమ్మ ఎన్నిక   •   గత ప్రభుత్వ అలసత్వం వల్లనే గ్రామంలో పరిశుభ్రత లోపించింది   •   సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ ఫోన్ల రికవరీ   •   డీఏ, పీఆర్సీ మంజూరు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం: పీఆర్టీయుటీఎస్   •  

సుచిత్ర అకాడమీ జోడీకి స్వర్ణం

08-06-2026 12:21 AM

జాతీయ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ

హైదరాబాద్, జూన్ 7: ప్రముఖ బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిన సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతూ కొత్త తరం ఛాంపియన్లను తయారు చేస్తోంది. తాజాగా గచ్చిబౌలీలో జరిగిన ఆలిండియా సబ్‌జూనియర్(అండర్ 15) జాతీయ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సచిత్ర అకాడమీకి చెందిన కిమ్ కిమ్ ఖోంగ్‌సాయ్, లియాన్ సాంగ్‌పుయా జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జంట సెమీస్‌లో రెండో సీడ్‌కు షాకిచ్చిం ది. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి విజేతగా నిలిచింది. మణిపూర్‌కు చెందిన కిమ్ కిమ్ ఖోంగ్‌సాయ్,లియాన్ సాంగ్‌పుయా జోడీ నైపుణ్యాన్ని గుర్తించిన సుచిత్ర బ్యా డ్మింటన్ అకాడమీ డైరెక్టర్ కె.ప్రదీప్‌రాజు ఇక్కడకు తీసుకొచ్చి ప్రత్యేక శిక్షణ, వసతి, ఫిట్‌నెస్ వంటి సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రోత్సాహానికి తగ్గట్టే ఈ జోడీ పలు టోర్నీల్లో సత్తా చాటుతుండడంతో ప్రదీప్ రాజు హర్షం వ్యక్తం చేశారు.