11 August, 2026 | 4:34 AM

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో భూపాలపల్లి విద్యార్థులకు బంగారు పతకాలు

11-08-2026 12:00 AM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 10 (విజయ క్రాంతి) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బషీర్ కరాటే డూ అసోసియేషన్ వారు ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన షావులీన్ డ్రాగన్ మార్షల్ ఆరట్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్ కరాటే శ్రీనివాస్ (మాదాసి) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కటాస్ విభాగంలో విధిష దేవి గోల్ మెడల్, గీతిక శ్రీ గోల్ మెడల్, టి హరిణి గోల్ మెడల్, తానూశ్రీ గోల్ మెడల్, నవ్య శ్రీ సిల్వర్ మెడల్, స్నితిక బ్రాంజ్ మెడల్, లవన్ గోల్ మెడల్, ఈ రిషిత్ గోల్ మెడల్, హర్షిత్ గోల్ మెడల్, ప్రజ్వల్ బ్రాంజ్ మెడల్, కృతిక బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా స్పారింగ్ విభాగంలో విధ్విన్ గోల్ మెడల్, రిషిత్ గోల్ మెడల్, విధిష దేవి గోల్ మెడల్, టి హరిణి గోల్ మెడల్, మహిత శ్రీ గోల్ మెడల్, తనూశ్రీ గోల్ మెడల్, నవ్యశ్రీ సిల్వర్ మెడల్, ప్రజ్వల్ సిల్వర్ మెడల్, గీతిక శ్రీ బ్రాంజ్ మెడల్, స్నేహజ బ్రాంజ్ మెడల్, కృతిక బ్రాంజ్ మెడల్, ప్రజ్వల్ సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన తమ విద్యార్థులను, మాస్టర్ శ్రీనివాస్, సీనియర్ ఇన్స్ట్రక్టర్ అశోక్ లను సీనియర్ కరాటే మాస్టర్ మొండయ్య, మాస్టర్లు రవి, ప్రసాద్, బషీర్ లు ప్రత్యేకంగా అభినందించినట్లు పేర్కొన్నారు.