23 April, 2026 | 10:31 AM

బీఓఐ సుల్తాన్‌బజార్ శాఖ స్వర్ణోత్సవాలు

28-12-2024 12:35 AM

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)  హైదరాబాద్‌లో సుల్తాన్ బజార్ శాఖ ఏర్పాటుచేసి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్వర్ణోత్సవాల్ని నిర్వహించారు. 1974వ సంవత్సరం డిసెంబర్ 27న బీవోఐ సుల్తాన్ బజార్ శాఖ ప్రారంభమయ్యింది. స్వర్ణోత్సవాల్లో భాగంగా ఖాతాదారుల్ని సత్కరించారు. మంజూరీ లేఖలు అందించారు. శాఖ అందిస్తున్న వివిధ బ్యాంకింగ్ సేవల్ని వారికి వివరించారు. వినియోగదారులకు అవసరమైన అన్ని సేవల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని శాఖాధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.