4 July, 2026 | 12:38 AM

రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారం

04-07-2026 12:00 AM

 కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూర్ / కోటపల్లి, జూలై 3 : జిల్లాలో భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతో భూ సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు తహసిల్దార్ మ ల్లికార్జున్, ఎంపీడీఓ మోహన్ లతో కలిసి హాజరై మాట్లాడారు.

భూభారతి రెవెన్యూ స దస్సులలో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డుల ను చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యం లో రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసు కొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మొదటగా గ్రామంలోని భూములకు సంబంధించి హ ద్దులు నిర్ధారించడంతో గ్రామానికి సంబంధించిన భూమి స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు సైతం నిర్ధారణ అవుతాయన్నా రు.

పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం అంశాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీ సుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం భూములను ఆక్రమించినట్లయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సర్వే సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేస్తామన్నారు.