27 August, 2026 | 9:09 AM

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన

03-07-2026 09:54 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు  అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా నష్టపరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. వెల్దుర్తి ప్రైవేట్ పాఠశాల వద్ద  ఎక్కువ ధరకు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు.అధిక ఫీజులు కూడ వసూలు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పీఎం శ్రీ  కాంప్లెక్స్ హెచ్ఎం సాంబయ్య  మండల విద్యాధికారి తో మాట్లాడి  ఇట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో  నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.