calender_icon.png 28 June, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోండు మహిళ మైసాగా..

28-06-2025 12:20:40 AM

అందం, అభినయంతో అభిమానులు గుండెల్లో నేషనల్ క్రష్‌గా స్థానం సంపాదించుకున్న రష్మిక మందన్న ఓ మహిళా ప్రాధాన్య చిత్రంతో భయపెట్టేందుకు సిద్ధమైంది. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సాయి గోపా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఈ చిత్రానికి ‘మైసా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో రష్మిక ఫియర్స్, ఇంటెన్స్ లుక్ కట్టిపడేసింది. సాంప్రదాయ చీరలో, ముక్కుపుడక, ఆభరణాలతో రష్మిక ఒక గోండు జాతి మహిళగా కనిపించారు.

ఆమె ఇంటెన్స్ లుక్, రక్తపు మరకలున్న రూపం, ఆమె చేతిలో గట్టిగా పట్టుకున్న ఆయుధం.. అన్నీ చూస్తుంటే.. రష్మిక ఒక శక్తిమంతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. టైటిల్, ఫస్ట్‌లుక్ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని రేకెత్తించాయి. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌లను.. రష్మిక కోలిగ్స్, పలు ఇండస్ట్రీల ప్రముఖులు రిలీజ్ చేశారు. తెలుగు లుక్, పోస్టర్‌ను దర్శకుడు హను రాఘవపూడి లాంచ్ చేయగా..

రష్మిక ‘కుబేర’ కో యాక్టర్ ధనుష్ తమిళ్ పోస్టర్‌ను, ‘చావా’ కో యాక్టర్ విక్కీ కౌశల్ హిందీ పోస్టర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ పోస్టర్‌ను, శివరాజ్‌కుమార్ కన్నడ పోస్టర్‌ను విడుదల చేశారు. రష్మికకు, మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లె స్పందిస్తూ.. “మైసా’ అనేది రెండు సంవత్సరాల కష్టం ఫలితం. కథ, ప్రపంచం, కళా దృక్పథం, పాత్రలు..

ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఈ కథను ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. “ఓర్పు ఆమె ఆయుధం. ఆమె గర్జన వినిపించేందుకు కాదు.. భయపడించేందుకు! రష్మిక మందన్నను ‘మైసా’ పాత్రలో చూడండి, ఆమె ఫియర్స్ అవతార్ ఇదే” అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించి కీలక సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వచ్చే వారం తెలియజేయనున్నారు.