18-04-2025 07:56:39 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం రాపల్లి కోట, బెగ్లూర్ గ్రామాల్లోని యేసు ప్రేమిస్తున్నాడు ప్రార్ధన మందిరాల్లో జోసెఫ్ , ప్రకాష్ , సురేష్ పాస్టర్ల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు మాట్లాడుతూ... ఏసుక్రీస్తు సిలువలో పలికిన అతి ప్రాముఖ్యమైన 7 మాటలను విశ్వాసులకు వివరించారు.
1)మాట : తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరేరుగరు కనుక వీరిని క్షమించుము.
2) మాట : నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిచ్చయముగా నీతో చెప్పుచున్నాను.
3)మాట : అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాను.
4)మాట : నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి.
5)మాట : నేను తప్పికొనుచున్నాను యోహాను.
6)మాట : సమాప్తమైనది యోహాను.
7)మాట: తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.
బైబిల్ వాక్యాదారాలతో ఏసుప్రభు సిలువలో పలికిన ఈ యొక్క ఏడు మాటలను వివరిస్తూ, ఏసుక్రీస్తు ఈ రోజు సమస్త మానవాళి పాపము కొరకై రక్తమును కార్చి పాపపరిహారం జరిపించాడు అని వివరిస్తూ క్రీస్తు సిలువ సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, పలు గ్రామాల విశ్వాసులు, జీసస్ లవ్స్ ప్రేయర్ టీం సభ్యులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరికీ సందేశమును గుడ్ ఫ్రైడే శుభాకాంక్షల తెలియజేసినారు.